దర్శి: తాళ్లూరులో పిచ్చుక పిల్లలను కాపాడబోయిన అంగన్వాడి ఆయా ఆదెమ్మ మృతి
ప్రకాశం జిల్లా తాళ్లూరులో అంగన్వాడి ఆయా విద్యుత్ షాక్ తో మరణించింది. ఇంటి వద్ద చెట్టుపై నుంచి గాలికి కింద పడుతున్న పిచ్చుక పిల్లలను కాపాడేందుకు ఆమె ప్రయత్నించారు. కూతురి సాయంతో ఇనుప పైపుతో పిచ్చుక గూడును సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన కూతురు హాస్పటల్లో చికిత్స పొందుతున్నారు.