రాయదుర్గం: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులు భర్తీ చేయాలి : AISF, AIYF, SFI నేతల డిమాండ్
రాయదుర్గం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు పెరుగుతున్నా టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని AISF, AIYF, SFI నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాయదుర్గం ఎంఈఓ ఇర్షద్‌కు వినతిపత్రం అందజేశారు. రాయదుర్గం మండలం కదరంపల్లి పాఠశాలలో 115 మంది విద్యార్థులకు కేవలం ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారని, దీంతో బోధన సరిగా జరగడం లేదని తెలిపారు. దాదాపు అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి అన్నారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతోంది. కానీ గ్రామీణ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తోంది" అని ఆరోపించారు.