దర్శి: దర్శిలో అసంపూర్తిగా నిలిచిపోయిన రైతు బజార్ గదుల నిర్మాణాలు
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్డులో రైతు బజార్ గదుల నిర్మాణం చేపట్టారు. కానీ అసంపూర్తిగానే నిలిచిపోయాయి. గత మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన రైతు బజార్ గదులను ఇంత వరకు పూర్తి చేయలేదు. మొండి గోడలు దర్శనమిస్తున్నాయి. రైతు బజార్ అందుబాటులోకి వస్తే చౌకగా నాణ్యమైన కూరగాయలు అందుబాటులోకి వస్తాయని స్థానికులు అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.