శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.ఇటీవల కాలంలో సబ్ రిజిస్టర్ పై పలు ఫిర్యాదులు వెళ్లడంతో ఏసీబీ దాడులు నిర్వహించారు. విషయం తెలుసుకున్న స్టాంప్ వెండర్లు పరారీ అయ్యారు.సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తలుపులు మూసివేసి విచారణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనంతపురం జిల్లా ఏసీబీ సీఐ జయమ్మ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంటి స్థలాలు సాగు భూముల క్రయవిక్రాయల కు వచ్చిన వారిని కార్యాలయంలో పనిచేసే వారికి లంచాలు ఇస్తున్నారా అని ఆరా తీశారుసుమారు 3 గంటల పాటు సోదాలు చేశారు