కొండపి: కొండపిలో ఏపీ రైతు సంఘం నాయకులు పర్యటన, జూన్ 1 చలో గుంటూరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన రైతు సంఘం నాయకులు
ఉమ్మడి ప్రకాశం జిల్లా జూన్ 1న గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘ ప్రకాశం జిల్లా ప్రతినిధులు రాయబారం వెళ్తున్నట్లు తెలిపారు. గత ఏడాది పొగాకు సంక్షోభంతో వచ్చిన నష్టానికి తోడు ఈ ఏడాది పరిస్థితి మరీ దిగజారిందని అన్నారు. గత ఏడాది కేజీకి రూ.280 ప్రారంభ ధర కాగా.. ఈ ఏడాది రూ.250తో కొనుగోలు మొదలుపెట్టి 70 శాతం పొగాకును తిరస్కరిస్తున్నారని తెలిపారు.