విశాఖపట్నం: ఏపీలో 50 డిజిటల్ కేంద్రాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సదస్సులో ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈల తయారీ కోసం 50 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏఐ యుగంలో నైపుణ్యాభివృద్ధి, ప్రాథమిక ఇంజినీరింగ్ విద్యపై నిపుణులు దిశానిర్దేశం చేశారు.