మార్కాపురం: శాశ్విత రాజధాని అమరావతి సాధించుకున్న సందర్భంగా ప్రవర్తలతో ర్యాలీ చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ శాశ్విత రాజధాని అమరావతి సాధించుకున్న సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జై జై అమరావతి సాధించుకున్నాం అమరావతి అంటూ, నినాదాలు చేస్తూ, స్థానిక గడియారం సెంటర్ నుండి దోర్నాల సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని లేకుండా మూడు ముక్కలాట ఆడి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారన్నారు.