దర్శి: ముండ్లమూరు మండలంలో పెట్రోల్ డీజిల్ కోసం ఎగబడ్డ వాహనదారులు, అర్ధరాత్రి సైతం పెట్రోల్ కోసం పడిగాపులు
Darsi, Prakasam | Apr 25, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ల గ్రామంలో డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. స్థానిక పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరుతున్నారు. ముఖ్యంగా రైతులు, ట్రాక్టర్ యజమానులు, ఆటో డ్రైవర్లు డీజిల్ కోసం క్యానులతో తరలివచ్చి కొనుగోలు చేస్తున్నారు. డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనతో ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.