గిద్దలూరు: కంభం మండలం పరసర ప్రాంతాలలో మద్యం తాగి వాహనం నడిపిన 31 మందికి జరిమానా జైలు శిక్ష విధించిన గిద్దలూరు కోర్టు
మార్కాపురం జిల్లా కంభం మండల పరిసర ప్రాంతాలలో మద్యం తాగి వాహనం నడిపిన 30 మందికి గిద్దలూరు కోర్టు గురువారం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున జరిమానా విధించింది. అంతేకాకుండా మరొకరికి 15 రోజులు జైలు శిక్ష పదివేల రూపాయలు జరిమానా విధించినట్లు ఎస్ఐ శివకృష్ణారెడ్డి గురువారం తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శివకృష్ణారెడ్డి వాహనదారులను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.