నంద్యాల అర్బన్: నంద్యాల మీదుగా శబరిమలకు ప్రత్యేక రైలు : ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
Nandyal Urban, Nandyal | Nov 13, 2026
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం నంద్యాల మీదుగా కాకినాడ నుంచి కొల్లంకు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు నడపనున్నట్లు MP డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. నవంబర్ 19 నుంచి జనవరి 21 వరకు 10 ట్రిప్పులు ఈ రైలు నడుస్తుందన్నారు. కాకినాడ నుంచి బయలుదేరే రైలు ప్రతి గురువారం సాయంత్రం 6.40 గంటలకు నంద్యాల చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో ఆదివారం ఉదయం 5.45 గంటలకు నంద్యాల చేరుతుందన్నారు