గిద్దలూరు: కొమరోలు మండలం బాధినేనిపల్లి గ్రామంలో మొహరం పండగ సందర్భంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు ప్రారంభం
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం బాదినేనిపల్లి గ్రామంలో మొహరం పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలను వైసీపీ నాయకులు మనోజ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కామూరి రమణారెడ్డి గారు ప్రారంభించారు. రైతులు, యువకులు గ్రామ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గ్రామీణ క్రీడలలో గొప్ప క్రీడా అయినా బండలాగుడు పోటీలను పరిరక్షించుకోవడం ఎంతైనా ఉందని అన్నారు. పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.