గిద్దలూరు: టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం సమీపంలో ట్రాక్టర్, కారు ఢీకొని ఇద్దరికీ తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం ఫ్లైఓవర్ సమీపంలో కారు ట్రాక్టర్ ఢీకొన్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో ప్రమాదం జరగకుండా హైవే పోలీసులు జాగ్రత్త పడ్డారు.