బయ్యారం దళితవాడలో మహిళలు, యువకులు మద్యం, సారాయి, బెల్ట్ షాపులను పూర్తిగా బంద్ చేయాలని డప్పు చాటింపు ఉద్యమం చేశారు. మద్యం వల్ల కుటుంబాల్లో పెరుగుతున్న ఇబ్బందులు, అనారోగ్యం, గొడవలపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల నుండి చర్యలు కోరుతున్నారు.