కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో మర్రిపూడి మండలం రైతులు పొగాకు విక్రయాలు, ధరలు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు
ప్రకాశం జిల్లా కొండపి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం నిరాశ జనకంగా పొగాకు కొనుగోలు జరిగాయి. మర్రిపూడి మండలానికి చెందిన రైతులు నేడు 45 పొగాకు బేళ్లను కొనుగోలుకు తీసుకురాగా వివిధ కారణాలతో అధికారులు 13 పొగాకు బేళ్లను తిరస్కరించారు. గరిష్ట ధర కేజీకి రూ.250 వరకు పలికింది. రైతులు పొగాకు ధరలు జిఎస్టి వల్ల భారీగా తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.