తాడిపత్రి: కిష్టిపాడు సమీపంలో బ్రిడ్జిని ఢీకొన్న లారీ, డ్రైవర్ కి తీవ్ర గాయాలు, లారీ ముందర భాగం నుజ్జు
పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు సమీపంలో లారీ అదుపుతప్పి యాడికి కాలువను ఢీకొనింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. గుత్తి వైపు నుంచి తాడిపత్రి వైపు వెళ్లే లారీ అదుపుతప్పి బ్రిడ్జిని ఢీకొనింది. డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. లారీ ముందర భాగం పూర్తిగా దెబ్బతినింది. లారీ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.