మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం, భారీ గాలులతో ఇబ్బందులు పడ్డ పట్టణ ప్రజలు
మార్కాపురం జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఒక్కసారిగా చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆకాశంలో నల్లటి మేఘాలు ఆవరించి భారీగా ఈదురు గాలులు వీచాయి. దీంతో పడాల్సిన వర్షం తేలిపోయింది. పెద్ద పెద్ద శబ్దాలతో గాలులు వీచడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు.