శింగనమల: పెరవలి గ్రామంలో స్వచ్ఛ రథం వాహన సేవలో ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మండల కన్వీనర్ మారుతీ నాయుడు తెలిపారు
స్వచ్ఛరథం వాహన సేవలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని సింగనమల మండల కన్వీనర్ మారుతి నాయుడు తెలిపారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయం లో పెరవలి గ్రామంలోని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ కవర్లు వేస్ట్ పేపర్ లాంటివి ఎక్కడపడితే అక్కడ పడకుండా భద్రపరచుకొనే స్వచ్ఛరథం వాహనం తమ గ్రామానికి వచ్చినప్పుడు వాహనంలో వేస్ట్ పరికరాలు అందించాలని సూచించారు.