రాయదుర్గం: ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వం : సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి
కేంద్ర ప్రభుత్వం ఉపాది హామీ చట్టాన్ని పథకంగా మార్చి నీరుకార్చడంపై ఈనెల 10 నుండి 12 వరకూ పాదయాత్ర చేపడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి తెలిపారు. శనివారం రాయదుర్గంలో విలేకరులతో మాట్లాడారు. అనంతపురం నుండి బండ్ల పల్లి వరకూ జరిగే ఈ పాదయాత్రను సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ప్రారంభిస్తారని వెల్లడించారు. వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.