విశాఖపట్నం: వైజాగ్‌లో ఘనంగా ప్రొపర్టీ ఎక్స్పో: సందర్శించిన మంత్రులు, వీఎంఆర్డీఏ స్టాల్ ప్రత్యేక ఆకర్షణ
గాదిరాజు ప్యాలెస్‌లో జరుగుతున్న వైజాగ్ ప్రొపర్టీ ఎక్స్పోను మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించారు. నరెడ్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పోలో వీఎంఆర్డీఏ స్టాల్‌ను పరిశీలించిన మంత్రులు, రాబోయే అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్‌గోపాల్ పేర్కొన్నారు.