మార్కాపురం: జిల్లా కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీలో పాల్గొన్న ఆర్డీవో శివరామిరెడ్డి
మార్కాపురం జిల్లా కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శారీరక మానసిక దృఢత్వానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు నిత్యజీవితంలో అలవాటు చేసుకోవాలని కోరారు.