మార్కాపురం: జిల్లా కేంద్రంలో మూడు రోజుల అనంతరం పెట్రోల్ బంకుల వద్ద తగ్గిన రద్దీ
మార్కాపురం జిల్లా కేంద్రంలో గత మూడు రోజులుగా పెట్రోల్ డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆ సమస్య లేకుండా సాధారణ స్థితికి రావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం సోషల్ మీడియా ప్రచారంతో పెట్రోల్ బంకుల వద్ద మూడు రోజులుగా వాహనదారులు ఆటోలు కార్లుతో రద్దీ నెలకొన్నది. అధికారులు పోలీసులు పర్యవేక్షణతో పెట్రోల్ డీజిల్ పరిమిత స్థాయిలో ఇవ్వడం జరిగింది.