మార్కాపురం: జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసిన రవాణా పోలీస్ శాఖ అధికారులు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఎస్ వి కే పి కళాశాల ప్రాంగణంలో పట్టణంలోని ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన స్కూల్ బస్సులను రవాణా పోలీస్ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ప్రైవేట్ పాఠశాల బస్సులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగిందన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బస్సులలో ఉండవలసిన పరికరాలను పరిశీలించామన్నారు. చిన్నచిన్న తప్పులను గుర్తించి వాటిని సర్దిద్దుకోవాలని హెచ్చరించామన్నారు. అదేవిధంగా డ్రైవర్లకు సమావేశం నిర్వహించారు.