కొండపి: కొండపిలో రోడ్డు నిర్మాణం వల్ల ట్రాఫిక్ కష్టాలు, ఇక్కడ పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలన్న వాహనదారులు
ప్రకాశం జిల్లా కొండేపి ఆర్టీసీ బస్టాండ్ నుంచి మద్దులూరు రోడ్డు వెళ్లే బీసీ హాస్టల్ వరకు రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తరచూ ట్రాఫిక్ జామ్ కావటం ఒక్కోసారి వాహనదారుల మధ్య ఘర్షణలు జరగడం పరిపాటిగా మారిందని వాహనదారులు అన్నారు. అయితే వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు ఒక కానిస్టేబుల్ను ఏర్పాటుచేస్తే బాగుంటుందని కోరుతున్నారు.