మార్కాపురం: బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ల సమస్యల పరిష్కరించాలని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద రిటైర్డ్ ఉద్యోగుల నిరసన
మార్కాపురం బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ముందు ఆల్ ఇండియా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యను పరిష్కరించాలని శాంతియూత నిరసన తెలిపారు. పెన్షన్ చెల్లింపు విధానంలో జరుగుతున్న కుట్రను వ్యతిరేకిస్తున్నామని కార్యదర్శి శ్రీనివాసరెడ్డి అన్నారు. పెన్షనర్స్ మధ్య కొత్త పాత తారతమ్యాలు లేకుండా న్యాయబద్ధంగా పెన్షన్ చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు