రాయదుర్గం: పాఠశాల సమీపంలో గుట్కా, సిగరేట్లు విక్రయిస్తే కఠిన చర్యలు : బొమ్మనహాల్ ఎస్ఐ నభిరసూల్
పాఠశాలల వద్ద గుట్కాలు, సిగరెట్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవని బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరనూల్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలో పాఠశాలల నుంచి వంద మీటర్ల దూరంలో ఉన్న దుకాణాల్లో గుట్కాలు, సిగరెట్లు అమ్మతున్న దుకాణాలపై దాడులు చేసి జరిమాన విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నబీరసూల్ మాట్లాడుతూ పాఠశాలకు కనీసం వంద మీటర్ల దూరం వరకు గుట్కాలు, నెగరెట్లు విక్రయించరాదన్నారు. ఇష్టానుసారంగా పాఠశాలల సమీపంలో గుట్కాలు, సిగరేట్లు అమ్మినా, తాగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 18 ఏళ్లులోపు పిల్లలకు గుట్కాలు, సిగరేట్లు అమ్మరాదన్నారు.