దర్శి: పురిమెట్ల గ్రామంలో పోలేరమ్మ తల్లి తిరుణాల మహోత్సవం
Darsi, Prakasam | Jun 23, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని పురిమెట్లలో పోలేరమ్మ తల్లి తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు పెద్దలు తెలిపారు. తొలి రోజు గ్రామ మహిళలు నీళ్ల బిందెలతో డప్పు వాయిద్యాల మధ్య గ్రామ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. బొడ్రాయి పోలేరమ్మ తల్లి విగ్రహాలకు జలాభిషేకం చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేయడంతో పండగ వాతావరణం నెలకొన్నది.