గిద్దలూరు: గిద్దలూరులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు రైల్వే స్టేషన్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు ఎమ్మెల్యే పోలియో చుక్కలు వేశారు. ఐదు సంవత్సరాల లోపు వయసు కలిగిన తమ పిల్లలకి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు. పోలియో చుక్కల వల్ల పోలియోని శాశ్వతంగా నిర్మూలించవచ్చని ఎమ్మెల్యే అన్నారు.