యర్రగొండపాలెం: త్రిపురాంతకం మండల కేంద్రంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించిన ఎమ్మార్వో వసుదేవరావు
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో ఎమ్మార్వో వసుదేవరావు ఎంపీడీవో మురళి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి యోగ పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు యోగాను అలవాటు చేసుకోవాలన్నారు