యర్రగొండపాలెం: వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల రైతులతో స్వయంగా మాట్లాడారు. 300 కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మంజూరు చేస్తున్నానన్నారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదని ధైర్యంగా ఉండాలని టిడిపి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.