రాయదుర్గం: బిజెపి జిల్లా ఉపాధ్యక్షులుగా హీరోజీరావు నియామకం, సర్వత్రా హర్షం
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా బొమ్మనహాల్ మండలంలోని ఉంతకల్లు గ్రామానికి చెందిన హీరోజీరావు నియమితులయ్యారు. గత 26 ఏళ్లుగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రతిపక్షాల వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఆయన చేస్తున్న సేవలను గుర్తించి ఈ పదవి అప్పగించినట్లు పార్టీ అధిష్టానం గురువారం ప్రకటించింది. ఆయన నియామకంపై రాయదుర్గం నియోజకవర్గ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని, ఎన్డీఏ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు చేరవేస్తానని హీరోజీరావు తెలిపారు. రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.