రాయదుర్గం: కరువు సీమలో ధాన్యపు సిరులు, రైతులకు వరంగా మారిన భైరవానితిప్ప ప్రాజెక్టు
అసలే వేసవి కాలం, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కరువు సీమగా పేరొందిన అనంతపురం జిల్లాలో వరి సాగంటే ఆశామాషీ కాదు. అయితే ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించి రాయదుర్గం నియోజకవర్గంలో రైతులు ధాన్యపు సిరులు పండించారు. కర్ణాటక సరిహద్దున ఉండి, కరువు, వలసలు అధికంగా ఉన్న గుమ్మగట్ట మండలంలోని రైతులకు భైరవానితిప్ప ప్రాజెక్టు వరంలా మారింది. ఒకప్పుడు ‘బుద్ధితక్కువ ప్రాజెక్టు’గా పిలువబడే ఈ ప్రాజెక్టే ఇప్పుడు ‘బువ్వ పెట్టే ప్రాజెక్టు’గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టులోకి పుష్కలంగా నీరు చేరింది. దీంతో ఆయకట్టు కింద ఉన్న వేలాది ఎకరాలు సాగులోకి వచ్చింది.