రాయదుర్గం: ప్రైవేట్ విద్యా సంస్థలు బస్సులు రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : సీఐ వెంకటరమణ హెచ్చరిక
*ప్రైవేటు స్కూల్ బస్సుల్లో భద్రతా నిబంధనలు తప్పనిసరి: సీఐ వెంకటరమణ* ప్రైవేటు విద్యా సంస్థల బస్సుల్లో విద్యార్థులను తరలించే సమయంలో రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన MVI విశ్వనాథ రెడ్డి తో కలిసి రాయదుర్గంలోని ప్రైవేటు స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. బస్సుల కండీషన్, ఫిట్‌నెస్, ఫస్ట్ ఎయిడ్, అత్యవసర ఎగ్జిట్ వంటి అంశాలను పరిశీలించారు. తనిఖీల్లో కొన్ని లోపాలు గుర్తించి డ్రైవర్లకు, స్కూల్ యాజమాన్యాలకు తగిన సూచనలు చేశారు.