యర్రగొండపాలెం: ఆగి ఉన్న డీసీఎం లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం జమ్మి దోర్నాల అడ్డరోడ్డు వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన ఓ లారీ ఆగి ఉండగా వెనక వైపు నుంచి వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్ కింద పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని 108 వాహనంలో దోర్నాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన వ్యక్తి వరి కోత మిషన్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వీరేష్ గా గుర్తించారు. టూరిస్ట్ బస్సు గుజరాత్ నుండి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చేస్తుంది.