కొండపి: మర్రిపూడి మండలం రాజుపాలెంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని అరెస్టు చేసిన పోలీసులు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండల పరిధిలోని సెయింట్ రాజుపాలెంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను ఎస్సై రమేశ్ బాబు నేతృత్వంలో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.5,280 నగదు, పేకాట ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.