మార్కాపురం: లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేసిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం పట్టణంలోని బిలాల్ మసీదు సమీపంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతినెలా సకాలంలో పింఛన్ అందజేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. సెలవు రోజులు లేద ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రతినెలా ఒకటో తేదీ కన్నా ముందుగానే అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు.