మార్కాపురం: జిల్లా కేంద్రంలో ఆపరేషన్ క్లీన్ స్విప్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలోని కంభం రోడ్డులో వన్ స్టేట్ వన్ క్లిన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలెక్టర్ విజయ సునీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్రైనేజీ క్లీన్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలు సహకరించాలని పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం బాగుంటామని జిల్లా కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.