రాయదుర్గం: విఏ బజార్ సహా పలు ధుఖాణాలలో లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు, రెండు కేసులు నమోదు
PGRS ఫిర్యాదు మేరకు రాయదుర్గం టౌన్ లోని VA బజార్ సహా పలు సూపర్ మార్కెట్లలో లీగల్ మెట్రోలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కంపెనీ ముద్రించిన MRP కంటే అధిక ధర స్టిక్కర్లు అతికించినందుకు V.A బజార్ పై రూ.25 వేలు, అలాగే సిగరెట్లు అధిక ధరకు అమ్మినందుకు మరోషాపు యజమానికి రూ.10 వేలు అపరాధ రుసుము విధించి 2 కేసులు నమోదు చేసినట్టు లీగల్ మెట్రాలజీ ఇనిస్పెక్టర్ శంకర్ తెలిపారు. గతంలోనూ V.A బజార్ కు రూ.25 వేలు జరిమానా విధించారు. వ్యాపారులు MRP కంటే ఎక్కువ వసూలు చేస్తే లీగల్ మెట్రోలజీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఇనిస్పెక్టర్ శంకర్ హెచ్చరించారు. వినియోగదారులు తూకం సరిచూసుకోవాలన్నారు