గిద్దలూరు: బేస్తవారిపేట మండలం సింగరపల్లి గ్రామంలో పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి రైతు విద్యుత్ షాక్ తో మృతి
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం సింగర్ పల్లి గ్రామంలో ఆదివారం పొలంలో నీళ్లు పెట్టేందుకు వెళ్లి రైతు రమణయ్య సంఘటన స్థలంలోని మృతి చెందాడు. ఈదురు గాలులకు తెగిపడ్డ విద్యుత్ తీగలలను గుర్తించక పొలం స్టార్టర్ని ప్రారంభించే క్రమంలో రైతు విద్యుత్ షాక్కుకు గురయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.