యర్రగొండపాలెం: దోర్నాల పట్టణంలోని శివాలయంలో మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు
మార్కాపురం జిల్లా దోర్నాల పట్టణంలోని ప్రేమ సాయి మందిరంలో వెలిసిన శివాలయంలో మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది. భక్తుల స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.