రాయదుర్గం: పెరిగిన స్థానాల్లో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలి : ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగ
రాయదుర్గం మున్సిపాలిటీలో పెరిగిన కౌన్సిల్ సభ్యుల స్థానాలకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని MRPS జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగ డిమాండ్ చేశారు. గురువారం కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు. గతంలో SC రిజర్వేషన్ 15 శాతం మేరకు 5 స్థానాలు కేటాయించాల్సి ఉండగా అలా జరగలేదన్నారు. ప్రస్తుతం 32 నుంచి 40 కు పెరగనున్నందున 6 సీట్లు కేటాయించి, వర్గీకరణ చట్టాన్ని అమలు చేయాలని కోరారు. సీనియర్ నాయకులు ATL గోవింద, శ్రీను, ఏసుఫ్, BT రాజు మాదిగ సీనియర్ నాయకులు గోవిందరాజులు మాదిగ తదితరులు పాల్గొన్నారు.