కొండపి: ఒంగోలు లోని మంగమూరు రోడ్డులో కారు దిచక్ర వాహనం ఢీకొని ఓ మహిళ మృతి, మరో ముగ్గురికి గాయాలు
ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని మంగమూరు రోడ్డులో కారు ద్విచక్ర వాహనం ఢీకొని ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 అంబులెన్సులో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు ద్విచక్ర వాహనం మహిళకు తగలడంతో మహిళ మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పోలీసులు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.