మార్కాపురం: కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమంలో అర్హత సాధించిన 352 మంది మహిళలు
మార్కాపురం జిల్లా కేంద్రంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మార్కాపురంలో రెండు కేంద్రాలు కొనకనమిట్ల మండలం గొట్లగట్టు గ్రామంలో ఒక కేంద్రం పొదిలిలో ఒక కేంద్రంలో సుమారు 530 మందికి శిక్షణ ఇవ్వడం జరిగిందని బీసీ కార్పొరేషన్ డిస్టిక్ కోఆర్డినేటర్ బ్రహ్మానందం తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న 530 మందికి పరీక్ష నిర్వహించారు. పరీక్ష పరిశీలకులుగా బాలకృష్ణ వ్యవహరించారు. వీరిలో మార్కాపురం మొదటి కేంద్రంలో 114 మంది రెండవ కేంద్రంలో 73 మంది గొట్లగట్టులో 60 మంది పొదిలిలో 115 మంది మహిళలు అర్హత సాధించారని తెలిపారు.