రాయదుర్గం: అర్బన్ సీఐ జయనాయక్ దర్మవరం కు బదిలీ
రాయదుర్గం అర్బన్ సిఐ జయనాయక్‌ను ధర్మవరం 2 టౌన్‌కు బదిలీచేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన 2024 ఆగస్టు 31 నుంచి రాయదుర్గం అర్బన్ సిఐగా సుదీర్ఘకాలం పాటు బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన హయాంలో పోలీస్ స్టేషన్ రూపురేఖలే మారిపోయాయి. పోలీస్ స్టేషన్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్ది తనదైన ముద్ర వేసుకున్నారు. పెండింగ్ లో ఉన్న కేసులు పరిష్కరించారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు.