గిద్దలూరు: అర్థవీడు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో చెత్త సేకరించే స్వచ్ఛ రథాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా అర్ధవీడు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సోమవారం చెత్త సేకరించే స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే అశోక రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మండలంలో గ్రామాల పరిశుభ్రతకు 17 చెత్త సేకరించి రిక్షాలను ప్రారంభించడమే కాకుండా 250 గృహాలకు చెత్త నిలువు చేసుకొని వెసులుబాటుకు చెత్త సేకరణ డబ్బాలో అందజేశారు. తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా చేసి చెత్త సేకరించే వారికి ఇవ్వాలని అలానే గ్రామాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.