యర్రగొండపాలెం: రాజంపల్లి తిరుమలనాథ స్వామి ఆలయంలో రాష్ట్రస్థాయి బండలాగు పోటీలు
పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామ సమీపంలో వెలిసిన గొడ్రాలికొండ తిరుమలనాధ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా జూలై 3వ తేది శుక్రవారం గజవాహనం రోజు న్యూ కేటగిరి భాగం, 4వ తేదీ శనివారం రథోత్సవం రోజు సీనియర్ విభాగం రాష్ట్ర స్థాయి పశు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు అర్చకులు భవాని ప్రసాద్ తెలిపారు. గెలుపొందిన వారికి ఆకర్షణీయమైన నగదు బహుమతి ఉంటుందన్నారు.