మార్కాపురం: నియోజకవర్గస్థాయి వివోఏ లకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
మార్కాపురం డ్వాక్రా బజార్ సమావేశం హాల్లో నియోజకవర్గస్థాయి వివోఏలకు సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ... సీఎం మహిళల కోసం డ్వాక్రా వ్యవస్థను తీసుకొచ్చారని రాకముందు మహిళలు ఎక్కువగా పొలం పనులు చేసేవారని అన్నారు. ఇప్పుడు మహిళలు స్వయం శక్తితో అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు అన్నారు. అనంతరం వివోఏ లకు స్మార్ట్ ఫోన్లు అందజేశారు.