కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు తగలబెట్టి గిట్టుబాటు ధర కల్పించాలని నిరసన తెలిపిన పొగాకు రైతులు
ప్రకాశం జిల్లా కొండేపి లో పొగాకు వేలం కేంద్రం వద్ద గిట్టుబాటు ధర కోరుకుంటూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం రైతులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్జీనియా పొగాకు కొనుగోలుకు 500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. కనీసం మద్దతు ధర 36వేల రూపాయలు ఉండేలా చూడాలని సమాఖ్య ఎస్టిసి పొగాకు కోర్టు ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం రోడ్డుపై పొగాకు చెక్కును తగలబెట్టి రైతు సంఘం నాయకులు పొగాకు రైతులు నిరసన తెలియజేశారు.