రాయదుర్గం: పట్టణంలోని వివిధ ప్రాంతాలలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు
రోడ్డు ప్రమాదాల నివారణలో బాగంగా రాయదుర్గం పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఆదివారం రాయదుర్గం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు, ఓపెన్ డ్రింకింగ్ తనిఖీలు నిర్వహించారు. పలువురికి జరిమానాలు వివరించారు. మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాల బారిన పడవద్దని ఎస్ఐ సూచించారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.