సంతనూతలపాడు: చీమకుర్తి మండలం రామతీర్థం సమీపంలోని సాగర్ కాలవలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతై మృతి, మరో ఇద్దరూ సురక్షితం
ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామతీర్థం సమీపంలోని సాగర్ కాలవలో ఈతకు వెళ్లి ఓ యువకుడు మృతిచెందగా మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. శనివారం వేసవి తాపం నుంచి రక్షించుకునేందుకు కాలువలో ఈతకు వెళ్లిన యువకులు గల్లంతగా ఇద్దరినీ స్థానికులు రక్షించారు. మరొకరిని కాలవలో నుంచి వెలికి తీసి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికి ఆ యువకుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు పిడుగురాళ్ల కు చెందిన అబ్దుల్ రెహమాన్ గా పోలీసులు గుర్తించారు. జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.