గిద్దలూరు: గిద్దలూరు మండలం దిగువ మెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టిన కారు, నలుగురికి గాయాలు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం దిగువ మెట్ట నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం అదుపుతప్పి ఒక కారు చెట్టును ఢీ కొట్టింది. ప్రమాదంలో నలుగురు క్షతగాత్రులు గాయపడగా వారిని హైవే పోలీసులు అంబులెన్స్ లో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు ప్రథమ చికిత్స చేయించుకొని అనంతరం వారి సొంత ఊరు తిరుమల కాగా వారు తిరుమలకు వెళ్లిపోయారు. మహానందికి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న గ్రామంలో ప్రమాదం జరిగినట్లుగా క్షతగాత్రులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.